Saturday, November 25, 2017

మీకు నరదిష్ఠి ఉన్నదని భావిస్తే :-ఏమిచెయ్యాలి

By 3:38 AM
మీకు  నరదిష్ఠి ఉన్నదని భావిస్తే :-ఏమిచెయ్యాలి

ఇంటికి ఉన్నటువంటి నరఘోష,నరద్రుష్టి,నరపీడ,నరశాపం అన్నీ కూడా తొలగిపోవాలంటే


మనం చాలా చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరిసంపదలు మన ఇంటికి కలుగుతాయి.అవి ఏమిటంటే మన ఇంటికి దాదాపుగా మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటటువంటి ద్రుష్టి దోషం అనేది మన ఇంటి మీద పడుతుంది.అందుకని మనం ఇంటికి దిష్టి తీసేస్తూ ఉండాలి. అసలు దిష్టి అనేది ఎప్పుడు తీయాలి అంటే ప్రతీ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయ అంటే కూర వండుకునే గుమ్మడికాయ తీసుకుని వచ్చి దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి మూడు సార్లు సవ్యదిశాగా దిష్టి తీసి మూడు సార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తరువాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కాని గేటు ముందు కాని గుమ్మడికాయను పగలగొట్టేసి దాని లో కొంచం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని కళ్ళు తుడుచుకుని కుడి కాలు లోపలకి పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి.ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి.తరువాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి.అలాగే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని దాని ఇంటి గడప మీద పెట్టి కత్తితో రెండు ముక్కలుగా కోసి వాటికి కొంచం పసుపు కొంచం కుంకుమ తీసుకుని ఆ ముక్కలకు వేసి గుమ్మానికి రెండువైపులా  అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి ద్రుష్టిదోషాలు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష,నరపీడ,నరశాపం,నరద్రుష్టి,నకారాత్మకశక్తి అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరిసంపదలు వచేస్తాయి అని పెద్దలు చెబుతూఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టిదోషాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి.


“సర్వేజనా సుఖినోభవంతు”
Read More...