దుస్తులు,ఆహార అలవాట్లపై వాతావరణ ప్రభావం
రుతుచక్రంలో చలికాలం ఒక ప్రధానమైన మలు పు. గజగజ వణికించే చలిని తన వెంట తీసుకు వస్తుంది. మారిన రుతువుకనుగుణంగా దుస్తులు మారాలి. చలినుండి శరీరాన్ని కాపాడుకోవడం కోసం రక్షక కవచంగా స్వెట్టర్లు, కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లౌజులు ఉపయోగిస్తాం. ఇలా దుస్తులు మారితేనే మనం మన దైనందిన జీవనాన్ని యథా విధిగా కొనసాగించగలుగుతాము. అయితే శరీరానికి బయట రక్షణ సరే. శరీరంలోపల ఆరోగ్యం సంగ తేంటి? కాలాన్ని బట్టి ఆహార నియమాలు కూడా పాటించాలి. అప్పుడే జీవక్రియ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మరి ఈ సీజన్‌కు తగ్గ వింటర్ డైయట్ పాటించాలి. మరి ఈ వింటర్ డైయట్‌కు సరిపోయే అటువంటి ఆహారాలు కొన్ని మిస్ చేయకుండా తినాల్సినవి కొన్ని మీ కోసం శీతాకాలంలో ఇటు వంటి ఆహారాలను మీ డైయట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ ఆహారపదార్థాలను మిస్ కాకుండా తిని ఆరోగ్యంగా జీవించండి.
ఆరెంజ్ : ఆరెంజ్‌ను అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శీతాకాలంలో తరుచూ వేధిం చే జలు బు, దగ్గు నుండి ఉపశమనం పొంద వచ్చు. దగ్గు, జలుబుకు కారణం అయ్యే బ్యాక్టీరి యాతో పోరాడ గలిగే శక్తి ఇందులో అధికంగా ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్‌ను ఇంట్లో నిల్వ చేసుకొని తరచూ తినడం వల్ల యాంటీబయాటిక్ అవసరం ఉండదు.
ఆకు కూరలు: ఈ వింటర్ సీజన్‌లో ఎక్కువగా దొరికే గ్రీన్ వెజిటెబుల్స్‌లో ఇదొకటి. అత్యధిక పోషకాలు కలిగినటువంటి ఆకు కూరలు. బచ్చలి కూర, తోటకూర, మెంతి, పాలకూర వంటివి అధిక రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి అద్బు Ûతంగా సహాయపడుతాయి. ఆకుకూరలు తినడానికి బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా వండి తినడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్, ఐరన్, క్యాల్షి యం, మెగ్నీషియం ఎక్కువగా శరీరానికి అందుతాయి.
వేరుశెనగలు: వేరుశెనగపప్పు ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిన విషయమే.ఇందులో ఎక్కువగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చివి. లేదా వేయించినవి. లేదా ఉప్పుపట్టిం చినవి. ఈ సీజన్‌లో తినడం చాలా ఆరోగ్యకరం. ఇంకా వేరుశనగపప్పుతో తయారు చేసిన చిక్కీలు బయట మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందు తాయి.
జామకాయ : జామపండును తినడం వల్ల జీవక్రి యను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా అద్భుతంగా సహాయపడుతుంది. పచ్చి జామకాయలో ఉన్న లైకోపిన్ అనే పదార్థం ధమని సమస్యలను నివారించడంలో బాగా పనిచేస్తుంది. పింక్ కలర్‌లో ఉన్న జామపండు, జ్యూసి జామ పండ్లను వింటర్ డైయట్ లిస్ట్‌లో చేర్చుకోవడం ఆరో గ్యానికెంతో క్షేమం.
కివిపండ్లు : ఇదొక అసాధారణ పండు. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఉప్పు చల్లిన ఈ కివి పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావల్సిన శక్తినంది స్తుంది. అంతేకాకుండా ఈ కివి పండ్లను శీతాకా లంలో వివిధ రకాల సలాడ్లలో కలిపి తీసుకోవడం మరింత ఆరోగ్యదాయకం. టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది.
నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్: తాజా పండ్లకంటే ఎండిన పండ్లలో పోషకాలు అత్యధికంగా ఉంటాయి. డ్రైఫ్రూట్స్‌తో పాటు నట్స్‌ను కూడా తరచూ తినడం వల్ల వింటర్ సీజన్‌లో ఎదురయ్యే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఇవి బాగా సహాయం చేస్తాయి. కాబట్టి స్నాక్స్ టైమ్‌లో వీటికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
0 comments:
Post a Comment