డిసెంబర్ ఒకటవ తేదీ 'ప్రపంచ ఎయిడ్స్ డే'గా గుర్తించారు. ఎయిడ్స్ వ్యాధికి క్యాన్సర్‌కు గల సంబంధం ఏమిటో చూద్దాం. ఎయిడ్స్ వ్యాధి హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్ (న×V) ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి కూడా ఒకనాడు క్యాన్సర్‌లాగే చాలా భయంకరమైన వ్యాధిగా అను కున్నాం. మందులు లేవు, చావు భయం అనుకున్నాము. ఎయిడ్స్ రోగిని దగ్గరకు రానిచ్చేవారు కాదు. కానీ ఈ రోజు ఈ వ్యాధి అంటే భయం తగ్గింది, మందులు న్నాయి. వ్యాధి గురించి ప్రజలలో అవగాహన పెరిగింది. చాలావరకు ఈ వ్యాధి రాకుండా చూచుకోవటం, ఒకవేళ వచ్చినట్లయితే దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవటం, పరీక్షలు చేయించు కోవటం, వైద్యం చేయించుకోవటం జరుగుతుంది. మరి క్యాన్సర్ వ్యాధి మిగతా వారిలో వచ్చినట్లుగా న×V ఇన్ఫెక్షన్ సోకినవారికి కూడా వస్తుంది కదా. కొన్నిరకాల క్యాన్సర్లు మిగతా వారికన్నా వీరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మిగతా వారికన్నా వీరిలో వైద్యం వల్ల ఫలితాలలో కూడా తేడా ఉంది. వీరిలో ఏ విధమైన క్యాన్సర్లు వస్తాయి? చూద్దాం.
న×V ×అటవష్‌ఱశీఅ వచ్చిన వారిలో, వారి జీవిత కాలంలో షుమారు 20 శాతం మందిలో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కోసారి న×V ఇన్ఫెక్షన్ ఉన్నట్లే రోగికి తెలియదు.క్యాన్సర్ గురించి పరీక్షలు చేస్తుంటే ఇది బయటపడుతుంది. 28 శాతం రోగులు ఈ విధంగా చనిపోతు న్నారు. న×V ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో సాధా రణంగా 'నాన్ హాడ్జ్ కిన్స్ లింఫోమా', 'కపోశి సార్కోమా', జననేంద్రియాల, మలద్వారం క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. మరి వీటికి కారణం అయిన ఆంకోజెనిక్ వైరస్‌లు జుజూర్‌వఱఅ దీaతీ Vఱతీబర (జుదీV), హ్యూమరన్ హెర్పిస్ వైరస్ 8 (ననV-8) హూమరన్ పాపిల్లోమా వైరస్ (నూV ఇది ఎక్కువగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లలో కనిపిస్తుంది) ఇవికాక 'హాడ్జ్ కిన్స్ లింఫోమా', 'బ్రెయిన్ లింఫోమా', 'బర్‌కిట్స్ లింఫోమా', ఊపిరితిత్తుల క్యాన్సర్, మల్టిపుల్ మైలోమా ువర్‌ఱషబశ్రీaతీ ుబఎశీబతీ మరియు చిన్నపిల్లల్లో వచ్చే సార్కోమా అను క్యాన్సర్లు కూడా ఈ రోగులలో కనిపిస్తుంటాయి.
న×V ఇన్ఫెక్షన్ డ్రగ్స్ ఇంజెక్షన్ రూపేణా తీసుకునే వారిలో హోమో సెక్సువల్, బైసెక్సువల్స్‌లోను, ఎక్కువ మందితో సంభోగము చేసేవారిలో, న×V ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న దేశాలవారిలో (ఉదా : ఆఫ్రికా, దక్షిణ తూర్పు ఆసియా) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎయిడ్స్‌లో శరీర రోగనిరోధక శక్తి భాగా తగ్గుతుంది. ఈ ఇన్ఫెక్షన్‌ను రక్తపరీక్ష- ఎంజైమ్ లింక్‌డ్ ఇమ్యునో యబ్‌ర్జార్ బెంట్ ఎస్సే (జుూ×ూA) చేయటం ద్వారా బయట పడుతుంది. ఇది పాజిటివ్ అయితే దీనిని ఔవర్‌వతీఅ దీశ్రీశ్‌ీ పరీక్ష ద్వారా లేదా ూశ్రీaరఎa న×V =చీA ద్వారా నిర్ధారిస్తారు. ూశ్రీaరఎa న×V =చీA, జణ4 కౌంట్ ద్వారా దీని తీవ్రతను కనుగొనవచ్చును. క్యాన్సర్ వైద్యం చేయునపుడు దానితో పాటుగా Aఅ్‌ఱ తీవ్‌తీశీఙఱతీaశ్రీ ్‌ష్ట్రవతీaజూy మరియు ఉజూజూశీత్‌ీబఅఱర్‌ఱష ఱఅటవష్‌ఱశీఅల కొరకు ముందు జాగ్రత్తగా ుతీవa్‌ఎవఅ్ చేయటం మంచిది.నఱస్త్రష్ట్రశ్రీy Aష్‌ఱఙవ aఅ్‌ఱ =వ్‌తీశీఙఱతీaశ్రీ ుష్ట్రవతీaజూy (నAA=ు)లో రకరకాల తీవ్‌తీశీఙఱతీaశ్రీ మందులను వాడుతారు. వీటిలో జిడోవుడిన్, డైడానోజిన్, డైడీ ఆక్సీ సైటిడిన్, టీనో ఫోవిర్ మొదలగు మందులు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇటువంటి వైద్యం ఎయిడ్స్ వ్యాధికి 1996-1997లో అందుబాటులోనికి వచ్చినది. దీనివలన 80 శాతం రోగులు మరణం నుండి తప్పించుకొనగలుగు తున్నారు. ఈ హార్ట్ వైద్యాన్ని అన్ని రకాల పరీక్షలను చేసి తర్వాత మొదలు పెడతారు. కీమోథెరపీ ఇస్తున్నపుడు ముందు జాగ్రత్తగా కొన్ని ఇన్ఫెక్షన్‌లకు సిడి4 కౌంట్‌ను బట్టి ఆంటీబయాటిక్‌లు ఇస్తారు. ఈ రోగులలో రక్తహీనత, తెల్లకణాలు, ప్లేట్‌లెట్స్ తగ్గటం మొదలగునవి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విడివిడిగా ఁA×ణూ =వశ్రీa్‌వస జaఅషవతీరఁను గురించి వివరంగా తెలుసుకుందాం.
1. ఎయిడ్స్ సంబంధిత నాన్‌హాడ్జ్‌లకిన్స్ లింఫోమా :- ఎయిడ్స్ రోగులలో చాలా ఎక్కువగా కనిపించే లింఫోమా. అన్ని వయసుల వారిలో కనిపిస్తుంది. ఎయిడ్స్ రోగుల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గినపుడు సిడి4 లింఫోసైట్స్ తగ్గి లింఫోమా వచ్చుటకు అవకాశం ఉంది. హార్ట్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య తగ్గుముఖం పట్టినదనటంలో అతనిశయోక్తి లేదు. ఇది హైగ్రేడ్ లింఫోమాగాను, ×ఎఎబఅశీbశ్రీaర్‌ఱష లింఫోమా లేక ూఎaశ్రీశ్రీ అశీఅషశ్రీవaఙవస లింఫోమాగాను చెపుతారు.
లక్షణాలు : 80 నుండి 90 శాతం ఎయిడ్స్ లింఫోమా రోగులు జ్వరం, రాత్రిపూట చమట పట్టటం, మరియు బరువు తగ్గటం లాంటి ఁదీ ూyఎజ్‌ూశీఎరఁ కలిగి ఉంటారు. 60-90% రోగులలో జుఞ్‌తీaఅశీసaశ్రీ లింఫో ములు కనిపిస్తాయి. (అంటే లింఫ్ గ్రంథులు లోనిచోట) కేంద్ర నాడీ మండలము (30%), జీర్ణమండలము 25%, రక్తమూలగ (20-33%) మరియు కాలేయము (10%) వంటి అవయవాలలో ఎక్కువగా చూస్తాము.
దీనిని బయాప్సీ పరీక్ష ద్వారా, కాట్ స్కాన్, పిట్ స్కాన్, బోన్‌మారో, వెన్నులోని నీరు మొదలగు పరీక్షలు చేయటం వల్ల ధృవీకరించవచ్చును.
వైద్యవిధానము : కీమోథెరపీ ఇస్తారు. జనఉూ, =-జనఉూ, జుూఉజన అను రకరకాల కీమోథెరపీలు ఇస్తాము. ఈ కీమోథెరపీ ఇచ్చేటప్పుడు Aఅ్‌ఱ తీవ్‌తీశీఙఱతీaశ్రీ ్‌ష్ట్రవతీaజూy కూడా ఇవ్వటం మంచిది. అవసరమయినపుడు కొన్ని సందర్భాల్లో రేడియో థెరపీ కూడా ఇస్తారు.
2. ప్రైమరీ సిఎన్‌ఎస్ లింఫోమా : ఇది కేంద్ర నాడీ మండలంలో వస్తుంది. ముఖ్యంగా మెదడులో వస్తుంది. ఇది Aసఙaఅషవస నఱఙ వ్యాధిలో కనిపిస్తుంది. (జణ4 కణాలు 50 ూవతీఎశ్రీ) ఫిట్స్ రావటం, తలనొప్పి, నాడీ మండలంకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. సిటి స్కాన్ చేయటం వల్ల మెదడులో ఈ లింఫోమా గడ్డ కనిపిస్తుంది. రేడియో థెరపీ ఇవ్వటం వల్ల ఈ గడ్డ 20-80 శాతం రోగులలో పూర్తిగా తగ్గుతుంది. కానీ ఇతర ఇన్ఫెక్షన్‌ల వల్ల 2 నుండి 3 నెలలకన్నా ఎక్కువ బ్రతకటం కష్టం. హార్ట్ కూడా ఇవ్వటం వల్ల కొంతకాలం జీవితం పొడిగించవచ్చు. హైడోస్ మెధోట్రిక్జేట్ కీమోథెరపీ కూడా మంచి ఫలితాలు చూపిస్తున్నాయి.
3. హాడ్జికిన్స్ లింఫోమా : ఈ రకమైన లింఫోమా అపుడపుడు కనిపిస్తుంది. దీనిలో జుజూర్‌వఱఅ దీaతీ Vఱతీబర (జుదీV) ఈ లింఫోమా కణాలయిన ఆర్.ఎస్ కణాలలో కనిపిస్తుంది. 80-90 శాతం రోగులు స్టేజ్-3 లేదా స్టేజ్-4లలో ఉంటారు. జ్వరం మొదలగు ఁదీ ూyఎజ్‌ూశీచీరఁ ఉంటాయి. జుఞ్‌తీaఅశీసaశ్రీ ప్రదేశాలలో గడ్డలు కనిపిస్తాయి.Aఅబర, తీవష్‌బఎలలో కూడా గడ్డలు ఉండవచ్చును.ఃAదీVణః అనే కీమోథెరపీ వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
4. కపోశీ సార్కోమా : ఎయిడ్స్‌కు సంబంధించిన 'కపోశీ సార్కోమా హోమో సెక్సువల్, బైసెక్సువల్‌లలో ఎక్కువగా ఉంటాయి. Aఅ్‌ఱ =వ్‌తీశీఙఱతీaశ్రీ ుష్ట్రవతీaజూy వల్ల వీటి సంఖ్యలో చాలా తగ్గుదల కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చర్మంపైన లేదా నోటిలోను, దవడ ఎముక, జీర్ణమండలములోను కనిపించవచ్చును. బయాప్సీలవల్ల దీనిని నిర్ధారించవచ్చును. జీర్ణమండలంలో ఉంటే కడుపునొప్పి, విరోచనములు, బరువు తగ్గటం, మొదలగునవి జరుగుతాయి. నAA=ుతో పాటు +aఅషఱషశ్రీశీఙఱతీ, జఱసశీటశీఙఱతీ మొదలగు మందులు వాడటం వల్ల హానీ తగ్గించవచ్చును. కీమోథెరపీ, లేజర్, శస్త్రచికిత్స వల్ల మరియు రేడియో థెరపీ వల్ల లోకల్‌గా క్రమబద్దీకరిం పవచ్చును. ఎక్కువగా ప్రాకుచున్నచో కీమోథెరపీ వాడుతారు.
5. సెర్వైకల్ క్యాన్సర్ : హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వల్ల ఈ క్యాన్సర్ రావచ్చును. 9 నుండి 26 సంవత్సరాల వారికి హెచ్‌పివి వ్యాక్సిన్ వాడుతున్నారు. ఎయిడ్స్‌కి సంబంధించిన ఈ క్యాన్సర్ తీవ్రంగాను, నఱస్త్రష్ట్ర +తీaసవ ుబఎశీబతీ గాను ఉంది. వైద్యం అయిన తర్వాత మరల తిరగపెట్టడం జరుగుతుంది. సాధారణంగా రేడియోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు. కొన్ని సందర్భాల్లో కార్సినోమా ఇన్‌సిటు దశలో 5 ఖీశ్రీబతీబతీaషఱశ్రీ ఆయింట్‌మెంట్ వాడుతారు.
6. Aఅaశ్రీ జaతీషఱఅశీఎa : ఎక్కువగా హోమోసెక్సువల్స్‌లో చూస్తాము. హెచ్‌ఐవి నెగిటివ్ వారిలో కన్నా పాజిటివ్ వారిలో 30-120 రెట్లు ఎక్కువగా కనిపిస్తుంది. మలములో రక్తము కారటం విరోచనము తెలియకుండా పడటం, నొప్పి లాంటి లక్షణాలు ఆయా జబ్బు తీవ్రతను బట్టి ఉంటుంది. Aఅబర లోపల గడ్డ ఉండవచ్చును. కీమోథెరపీ, రేడియో థెరపీ ద్వారా దీనికి వైద్యము చేయుదురు.
7. మరికొన్ని క్యాన్సర్లు : ఊపిరితిత్తుల క్యాన్సరు 2.5 నుండి 5 రెట్లు హెచ్‌ఐవి పాజిటివ్ రోగులలో కనిపిస్తుంది. పెదిమల క్యాన్సర్ 3.1 రెట్లు ఎక్కువగా చూస్తాము. పెదవుల క్యాన్సర్లలో హెచ్‌పివి ఇన్ఫెక్షన్ కూడా చూస్తున్నాము. పురుషాంగము క్యాన్సర్, ్‌వర్‌ఱర క్యాన్సర్, మైలోమా క్యాన్సర్, బర్‌కిట్స్ లింపోమాలు కూడా చూస్తుం టాము. బర్‌కిట్స్ లింపోమా ఒక్కోసారి పొట్టలో, నోటిలోను మాక్జిల్లా సైనస్‌లోను రావచ్చును. వీటన్నిటినీ సందర్భాను సారంగా రేడియో థెరపీ, కీమోథెరపీ, శస్త్రచికిత్స ద్వారా వైద్యం చేస్తారు.
ఎయిడ్స్ వల్ల రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు రావచ్చు. రోగికి నీరసం ఉంటుంది. ఇటువంటి వారికి నAA=ు వైద్యము చాలా ఉపయోగపడు తుంది. సిడి4 కణాల సంఖ్యను పరీక్షించు కుంటూ నAA=ు వైద్యంతో పాటు కీమోథెరపీ లేక రేడియోథెరపీ ఇవ్వటం వల్ల రోగికి కొంత ఊరట కలుగుతుంది. చాలా మందిలో ఫలితాలు బాగానే ఉంటాయి. కానీ ఈ రెండు జబ్బులు విడి విడిగా ఉన్నవారిలో కన్నా, రెండూ ఒకేరోగిలో ఉంటే ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు. ఇదివరకటి కన్నా ఈ మధ్య వచ్చిన మందులవల్ల, రేడియోథెరపీలో మోడ్రన్ టెక్నాలజీస్ వల్ల కొంతలో కొంత ఆశాజనకంగా పరిస్థితి మారుతుంది. ఈ రోగము రాకుండా చూచుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కోసారి రోగి పరిస్థితిని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి హెచ్‌ఐవికు వైద్యము ముందు మొదలు పెట్టాలా, క్యాన్సర్‌కు వైద్యము ముందు మొదలు పెట్టాలా అని వైద్యులు సందిగ్దము లో పడతారు. ఏది ఏమయినా ఈ ఆధునిక యుగంలో రోగి ఎక్కువ బాధపడకుండా, ఎక్కువ ఇబ్బంది పడకుండా వైద్యులు చూడగలుగుతున్నారు.
-డా||.V.ూ.చీ. రావు,వీ.ణ.,ణవీ=ు.,
క్యాన్సర్ వైద్య నిపుణులు.
సెల్:9849121050