deadline mobile appఈ ఆధునిక యుగంలో మనిషి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్నో రోగాలకు మందులు కనిపెట్టాడు, మరెన్నో వస్తువులను కనిపెట్టాడు. అయితే మరణించకుండా మాత్రం మందు కనిపెట్టలేక పోయాడు. ఎప్పుడు చనిపోయేది కూడా ఏ శాస్త్రవేత్త ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. అయితే మనిషికి మరణం ఎప్పుడు రాబోతుందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఒక సాప్ట్‌వేర్‌ కంపెనీ అరుదైన మొబైల్‌ యాప్‌ను తయారు చేసింది.
మనిషి జీవించే జీవన శైలి ఆధారంగా, అహారపు అలవాటు, చెడు అలవాట్లు ఆధారంగా ఒక మనిషి ఎంత కాలం బతుక గలడు, ఎప్పుడు చనిపోతాడు అనే విషయాలు చెప్పే యాప్‌ను జిస్ట్‌ఎల్‌ఎల్‌సి అనే సాప్ట్‌ వేర్‌ కంపెనీ కనిపెట్టింది. ‘డెడ్‌ లైన్‌’తో తెలుసుకోవచ్చు ఎంతో మంది డాక్టర్లను, ఇతర సర్వేలను అధ్యయనం చేసిన పిమ్మట ఈ యాప్‌ను రూపొందించినట్లు కంపెనీ వారు అంటున్నారు. ఈ యాప్‌కు ‘డెడ్‌ లైన్‌’ అనే పేరు పెట్టారు. ఈ యాప్‌ ద్వారా వ్యక్తి జీవన శైలిని మార్చుకుని ఆయుషు పెంచుకునే అవకాశాలున్నాయని ‘డెడ్‌ లైన్‌’ రూపకర్తలు అంటున్నారు. వ్యక్తి మరణ తేదీతో పాటు సమయాన్ని కూడా ఖచ్చితంగా అందించడం ఈ యాప్‌ ప్రత్యేకత. త్వరలోనే ఈ యాప్‌ అందరికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.