ముట్టుకుంటే మంటలు
Added At : Mon, 07/27/2015 - 09:50

- మిస్టరీగా మారిన ఉత్తరప్రదేశ్ బాలిక వ్యవహారం
ఆంధ్రప్రభ దినపత్రిక : నేషనల్ న్యూస్
ఝాన్సి: పురాణ కథలను తలపించే ఒక ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఒక 12 ఏళ్ల బాలిక తన చేతులతో ఏది ముట్టు కున్నా అది మండిపో తోంది. గోర్‌మాచయా గ్రామానికి చెందిన ఆ బాలిక వ్యవహారం ఇటీ వల గ్రామంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ బాలిక చేతుత్లో ఏదైనా కాలిపోవడాన్ని కొం దరు ఒక వరంగా పేర్కొంటుండగా, మరికొందరు దానిని ఒక శాపంగా భావిస్తున్నారు. మరికొందరు ఇది ఆమెను ఆవహించిన దుష్ట శక్తి ప్రభావం అన్న అనుమా నాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అది దుష్ట శక్తి ప్రభావం అయితే దానిని వదిలించ డానికి గ్రామంలోని కొంరదు పూజలు కూడా ప్రారంభించారు. ఆ బాలికను చిన్న తనంలోనే గ్రామ పెద్ద్ద దత్త్తత చేసుకున్నారు. ఆమె సలువుగా బల్బులు వెలిగేలా చేయ గలదని, కేవలం చేతితో తాకడం వల్ల నిప్పు పుట్టించగలదని ఆమె ఆలనా పాలనా చూస్తున్న వారు చెబుతున్నారు. అయితే ఆమె చేతి స్పర్శ వల్ల్లనేనేమో ఆమె బట్ట్టలకు నిప్పంటుకుంది. అయితే ఆదృష్టవశాత్తు ఆమె ఆ ప్రమాదం నుంచి ఆమె తప్పిం చు కోగలిగారు. అందువల్ల్ల ఆమె వెంట ఎప్పుడు ఎవరో ఒకరు ఉండేలా చూస్తున్నారు.
- See more at: http://www.prabhanews.com/%E0%B0%AE%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-%E0%B0%AE%E0%B0%82%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81#sthash.Qhzr13vC.dpuf
0 comments:
Post a Comment