Tuesday, July 28, 2015

ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...

By 10:00 PM

ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...

Tue, 25 Dec 2012, IST    vv
ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహాభాగ్యం...
సాధారణంగా మన శరీరం లోని ఏ భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం. కాని లివర్‌ (కాలేయం) విషయంలో చాలా సార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం. లివర్‌ సిర్రోసిస్‌ వంటి ఏ తీవ్ర సమస్యో మొదలయ్యాక గుండెలు బాదుకునే కన్నా ముందే జాగ్రత్త పడితే ఆ సమ స్యలు చాలా వరకు దరిచేరవు. శరీరం లో అతి కీలకమైన కాలేయాన్ని అత్యం త జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉం టుంది. అందుకు మనం ప్రతిదినం తీసుకొనే ఆహారమే లివర్‌కు మహా భాగ్యం.తీసు కునే ఆహారం ఎంత తాజాగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది. రసాయనాలతో పండించిన ఆహారం కాకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకుంటే మీ లివర్‌ పదిలం. వేపుళ్ళు ప్రిజర్వేటివ్స్‌ వేసి నిల్వ చేసిన పదార్థాలు మీ లివర్‌కు శత్రువులు. ఇంట్లో వండుకున్న తాజా ఆహారం ఉత్తమం. సొంత వైద్యం ఎంత మాత్రం మంచిది కాదు. శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలను వ్యాయామం, మసాజ్‌ల ద్వారా తరచు తొలగిస్తూ పోతే మీ లివర్‌కు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మద్యపానం హద్దుమీరితే మొదట కూలిపోయేది మీ లివర్‌ అని గుర్తుంచుకోండి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో చూద్దాం.
''ఆహారమే లివర్‌కు మహాభాగ్యం''.
1. వెల్లుల్లి : ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం. క్యాన్సర్‌కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిమిషాలు అలా ఉంచితే క్యాన్సర్‌ నిరోధించే ఎంజైమ్‌ ఎలెనాస్‌ బాగా మెరుగవుతుంది. సల్ఫర్‌ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కాలేయము ఆరోగ్యానికి, కీళ్లనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.
2. సిట్రస్‌ పండ్లు (ద్రాక్ష, ఆరెంజ్‌) : సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌ను కాపాడుటలో బాగా పనిచేస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుచుతుంది. ద్రాక్ష పండ్లలోని టన్నీస్‌, పాలిఫినాల్స్‌క్యాన్సర్‌ సంబంధిత కారకాలపై పోరాడుతాయి. శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాదు...ద్రాక్ష గింజల్లో ఉండే ప్రొనాంథోసైనిడిన్‌ అనే పదార్థం కాలేయాన్ని సంరక్షిస్తుంది.
3.వేరు దుంపలు : బీట్‌రూట్‌,క్యారెట్‌, బంగాళాదుంప వంటివి ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కాలేయంలోని కణాలు పునరుత్పత్తికి బాగా సహాయపడతాయి. డయాబెటిక్‌ లివర్‌ను కాపాడును. కాలేయం పనితీరు మెరుగుపడటానికి బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. ఈ ఆరోగ్యకరమైన దుంపలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.
4.ఆకు కూరలు : శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను అందిస్తూ...నిత్యం తమని ఏదో ఓ రకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకు కూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కు వగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి. ఆకు కూరలు ప్రతి రోజూతీసుకోవడం వల్ల శరీ రంలోని మలినాలను బయ టకు పంపివేయబడుతుంది.కాలేయాని కి ముఖ్యంగా కాకర కాయ, ఆకు కూరలు, క్యాబేజి వంటివి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి.
5. గ్రీన్‌టీ : టీ అన్నింటిలో గ్రీన్‌ టీ మాత్రమే అత్యంత శక్తివంత మైనది. ఈ ఆరోగ్యకర ఆహార అలవాట్లలో మనం సులువుగ చేర్చుకో గలిగింది గ్రీన్‌ టీ తాగేఅలవాటు. ముఖ్యంగా ఇందులోని 'ఇజీసీజి', '' కాటెచిన్స్‌'' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నిరోధిస్తుంది. ఈ టీ తాగినవారిలో అన్నవాహిక క్యాన్సర్‌ తగ్గినట్లు చైనా పరిశోధనలు చెపుతున్నాయి. దీనికున్న యాంటీ ఆక్సిడేటివ్‌, యాంటి ప్రొలిఫరేటివ్‌ గుణాలే ఇందుకు కారణం. రోజువారీగా గ్రీన్‌ టీని తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించుకోవచ్చు.
6.అవోకాడో : ఈ పండులో గుండెకు ఆరోగ్యానిచ్చే మోనోశాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థాలున్నాయి. దీనిలో ఫైటో కెమికల్స్‌ నోటి క్యాన్సర్‌ను నివారి స్తాయి. ఇది కాలేయాన్ని శుభ్ర పరచడమే కాకుండా కణజాలాలు మరియు కణాల పునరుద్ధరించడానికి బాగా సహాయ పడుతుంది. ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వల్ల కాలేయానికి మంచి ప్రయోజనం చేకూర్చుతాయి.
7.యాపిల్స్‌ : యాపిల్స్‌లో ఫైబర్‌ ఎక్కువగానూ,కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్‌ సి అధిక మొత్తాల్లో ఉంటుంది.యాపిల్‌ తోలులోను, లోపలి గుజ్జులోను పెక్టిన్‌ అనే పదార్థం ఉంటుంది. ఇది గ్యులాక్టురోనిక్‌ యాసిడ్‌ తయారీకి దోహదపడుతుంది. ఈ యాసిడ్‌ శరీరాంతర్గతంగా సంచితమైన అనేక హానికర పదార్థాలను బహిర్గత పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పదార్థం పేగుల్లోప్రోటీన్‌ పదార్థం విచ్చిన్నమవ్వకుండా నిరోధిస్తుంది కూడా.యాపిల్‌ ఉండే మ్యాలిక్‌ యాసిడ్‌లో అనేది పేగులు,కాలేయం,మెదడు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
8.ఆలివ్‌ ఆయిల్‌ : ఆలివ్‌ విత్తనాల నుండి ఆలివ్‌ నూనె తీస్తారు. ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్‌ నూనెలో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మోనో అన్‌ సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. ఈ నూనెలోని మోనో అన్‌ శాచ్యురేటెడ్‌ కొవ్వు పదార్థం కండర కణజాలాన్ని కాపాడుతుంది.
9.తృణధాన్యాలు : తృణధాన్యాల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్‌ అధికం. కాలేయం పనితీరు సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్‌ రైస్‌ మల్టీ గ్రెస్‌ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
10. బ్రొకోలి : ఇది క్యాలీఫ్లవర్‌ లాగా ఉంటుంది. ఇందులో పోషక తత్వాలు, విటమిన్‌ ఎ, యాంటి ఆక్సిడెంట్స్‌ పుష్కలం. ఉడికించిన లేదా పచ్చి క్యాలీఫ్లవర్‌ను వ్యాయామానికి ముందు లేదా తర్వాత తీసుకుంటే కండరాల నొప్పులు తొలగించడమే కాకుండా కాలేయాన్ని కాపాడుతుంది.

0 comments: