Tuesday, July 28, 2015

మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం! - Mental tension is causes deceases

By 11:54 PM

మానసిక ఆందోళనే అన్ని జబ్బులకు మూలం!

Tue, 19 Oct 2010, IST    vv
చాలామంది మానసికంగా ఆందోళన చెందుతూ శారీరకంగా కూడా అనారోగ్యానికి గురిఅవుతుంటారు. మానసిక సమస్యల వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావచ్చు. అవి ఏమిటంటే రినటీస్‌, ఆస్మా, క్షయ, తరచు రొంపతో బాధపడటం వంటివి. కొంతమంది వ్యక్తులు తరచూ రొంప సమస్యతో బాధపడుతుంటారు. ఇది శారీరక ఆరోగ్యలోపం వల్ల ఏర్పడవచ్చు. లేక మానసిక సమస్యల వల్ల కూడా ఏర్పడవచ్చు. ఈ అనారోగ్యానికి కారణం మనలో వున్న ప్రెస్టేషన్‌, ఇరిటేషన్‌ ఎవరూ పట్టించుకోని ఒంటరితనం. నిరాదరణ జీవితంలో ఎదురయ్యే సమస్యలూ కారణం కావచ్చు. ప్రెస్టేషన్‌, ఇరిటేషన్‌, ఒంటరితనం, లాంటి సమస్యలతో సతమతమయ్యే వ్యక్తులు తరచూ రొంప సమస్యతో బాధపడడం సర్వసాధారణం. దీనికి కారణం తరచూ టెన్షన్‌కి గురవుతూంటే వారి శరీరంలో రోగనిరోధకశక్తి ఇమ్యూన్‌సిస్టమ్‌ లో లోపం ఏర్పడి, పై అనారోగ్యాలకు గురి కావచ్చు.
రినటిస్‌ : మనలోని ఉద్వేగాలలో సంఘర్షణ, టెన్షన్‌ వల్ల ముక్కులోంచి నీరు వంటి ద్రవంకారటం, దురద, తుమ్ములు రావటం వంటివి జరుగుతాయి.
బ్రాంకైటిస్‌ ఆస్మా : మనలోని ఉద్వేగాల సంఘర్షణ వల్ల బ్రాంకైటిస్‌ ఆస్మా రావటానికి అవకాశం ఉంది.
జీర్ణవ్యవస్థ : టెన్షన్స్‌ వల్ల, ఉద్వేగాల వల్లా తీవ్రంగా ప్రభావితం అయ్యేది మన జీర్ణవ్యవస్తే దీని వల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినియల్‌ డిస్‌ ఆర్డర్స్‌ మన ఉద్వేగాల వల్ల కూడా రావచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో మానసిక సంఘర్షణల వల్లగాని ఆకలి లేకపోవటం సంభవించింది. దీని వల్ల బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఉద్వేగాలు, టెన్షన్‌లకి నిలయమైన వారు తాము సాధారణంగా తినేదాని కన్నా ఎక్కువ తినేస్తారు. అతిగా తినడం వల్ల అజీర్ణం, హైపరేక్టవిటి, పొట్టరావటం, కొవ్వు పెరగడం, నాసియా మరియు ప్లాటు లెన్స్‌లు వస్తాయి.
ఎటువంటి ఆందోళనకరపనులు, ఉద్వేగాలకూ లోనుకాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్న ట్లయితే ఈ సైకోసుమాటిక్‌ సమస్యల వలయంలోంచి బయటికి రావచ్చు. మనం మానసికంగా ఆరోగ్యంగా వుంటే భౌతికంగా కూడా ఆరోగ్యంగా వుంటాము. మన భౌతిక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యానికి దారి తీస్తుంది.
- పి.దుర్గ

0 comments: